మళ్ళీ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన .. తాప్సి ?

Friday, January 12th, 2018, 10:35:54 AM IST

సొట్టబుగ్గల తాప్సి ఫోకస్ మళ్ళీ టాలీవుడ్ పైనే పడింది. ఇప్పటికే బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తున్న తాప్సి .. పింక్ , నామ్ షబానా అంటూ నటిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది .. కానీ ఆమెకు గ్లామర్ హీరోయిన్ గా రాణించాలన్నా కోరిక మాత్రం నెరవేరడం లేదు .. దాంతో మళ్ళీ తనను గ్లామర్ హీరోయిన్ గా మార్చిన టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్ బయోపిక్ లోనటిస్తున్న తాప్సి తెలుగులో అవకాశాలు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. హిందీలో అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదని భావించిన ఈ అమ్మడు తెలుగులో ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరి సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిన తాప్సి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.