హాలీవుడ్ అంటే ఆసక్తి లేదంటున్న తాప్సి ?

Monday, May 21st, 2018, 12:26:05 PM IST

ఈ మధ్య ఇండియన్ స్టార్స్ కు హాలీవుడ్ లో తారలుగా ఎదగాలనే ఆశలు కలుగుతున్నాయి. ఎప్పుడైతే బాలీవుడ్ భామలు ప్రియాంకా చోప్రా .. దీపికా పదుకొనె లు అక్కడ క్రేజ్ తెచ్చుకున్నారో అప్పటి నుండి పలువురు భామలు కూడా హాలీవుడ్ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇండియన్ స్టార్ అంటే అక్కడి వాళ్లకు ఆసక్తి ఎక్కువ. అయితే అందరికి బిన్నంగా తనకు హాలీవుడ్ సినిమాల్లో పనిచేయడం పెద్దగా ఇష్టం లేదని షాకిచ్చింది సొట్ట బుగ్గల తాప్సి ? అదేంటి అందరు .. హాలీవుడ్.. హాలీవుడ్ అంటూ ఎగబడుతుంటే ఈమె ఇలా రివర్స్ గా మాట్లాడుతుంది ఏమిటి ? అని షాక్ అవుతున్నారా ? మీరు విన్నది నిజమే .. ఈ అమ్మడికి హాలీవుడ్ సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేదని చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. హాలీవుడ్ లో అవకాశం వస్తే నటించేందుకు ఇష్టమే కానీ .. ఆ అవకాశం కోసం రకరకాల ప్రయత్నాలు చేయడం మాత్రం చేయనని అంటోంది. నాకు ఇక్కడ మంచి సినిమాలు , మంచి పత్రాలు ఉన్నాయి .. వాటిని కాదని హాలీవుడ్ సినిమాల్లో అవకాశలకోసం ఎవరినో అడుక్కోవడం ఇష్టం లేదని చెప్పింది సొట్ట బుగ్గల తాప్సి.

  •  
  •  
  •  
  •  

Comments