పెళ్ళికి ముందే పిల్లలను కననంటున్న తాప్సి ?

Friday, September 14th, 2018, 09:34:20 PM IST


ప్రస్తుతం బాలీవూడ్ లో వరుస సినిమాలతో బిజిగా మరీనా సొట్ట బుగ్గల తాప్సి నటించిన మన్మార్జియా సినిమా ఈ రోజు విదుదలైంది. ఈ సినిమా తో మరో హిట్ కొట్టేసినట్టే అని బాలీవుడ్ లో టాక్. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూ లో పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది. పెళ్లి గురించి అడిగితె .. పెళ్లి చేసుకుని స్థిరపడడానికి ఇంకా టైం ఉందని, ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్న మాట వాస్తవమే అని .. కానీ పిల్లలు కావాలని అనుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటాను .. అంతే కానీ పెళ్ళికి ముందే పిల్లలను కనను అంటూ ఘాటుగానే సమాధానం చెప్పింది. తాప్సి గత కొన్ని రోజులుగా డెన్మార్క్ కు చెందిన మథియాస్ బో అనే బ్యాడ్మింటన్ క్రీడాకారుడితో ప్రేమాయణం సాగిస్తుంది. ఇద్దరు కలిసి ఈ మధ్య హాలిడేస్ కూడా ఎంజాయ్ చేశారు. సో పెళ్లి విషయంలో ఇంకా టైం తీసుకునేలా ఉందన్నమాట.

  •  
  •  
  •  
  •  

Comments