షాక్ .. సౌత్ సినిమాలపై కౌంటర్ వేసిన తాప్సి ?

Thursday, February 16th, 2017, 11:34:19 PM IST


గ్లామర్ భామ సొట్ట బుగ్గల తాప్సి ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి జోరు పెంచింది. ఇప్పటికే ఈ అమ్మడు అక్కడ నాలుగు సినిమాల్లో నటిస్తూ క్రేజ్ తెచ్చుకుంది. సౌత్ లో హీరోయిన్ గా ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా కమర్షియల్ విజయాన్ని అందుకొని తాప్సి .. సౌత్ సినిమాలపై కౌంటర్ వేసి షాక్ ఇచ్చింది ? ఏంటి తాప్సి ఇలా మాట్లాడింది అంటూ అందరు షాక్ అవుతున్నారు. ఇంతకీ తాప్సి ఏమందో తెలుసా .. హీరోయిన్స్ ని ముక్యంగా తనను సౌత్ పరిశ్రమ టార్గెట్ చేసిందని, సినిమాల్లో తన టాలెంట్ కి కాకుండా గ్లామర్ కె పరిమితం చేసారని అంటుంది? సౌత్ లో తాను నటించే సినిమాలు ప్లాప్ అయితే తనను ఐరెన్ లెగ్ అని ముద్ర వేశారని, అసలు సౌత్ సినిమాల్లో హీరోయిన్లకు ఏమాత్రం ప్రాముఖ్యత లేదని చెప్పింది? తాను నటించిన సినిమా ప్లాప్ అయితే అందులో తన భాగం ఎంతుందో చెప్పాలని ఫైర్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బేబీ , పింక్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం నామ్ షబానా చిత్రంలో నటిస్తుంది.