మేటి నాయిక‌ల‌పై తాప్సీ ప‌రాచికం ?

Saturday, January 20th, 2018, 04:48:46 PM IST

నాటి మేటి క‌థానాయిక‌లు ద‌శాబ్ధాల పాటు ప‌రిశ్ర‌మ‌ని ఏలేవారు. కానీ కాల‌క్ర‌మంలో క్యాట్ వాక్ నాయిక‌ల ఆరంగేట్రంతో ప‌రిశ్ర‌మ‌లో అభిన‌యం క‌రువైంది. ర్యాంప్ వాక్ భామ‌ల హావ‌భావాల్లో పూర్తి స్థాయి ప‌రిప‌క్వ‌త లోపించ‌డంతో వాళ్ల కెరీర్ సోసోగానే న‌డుస్తోంది. సుదీర్ఘ కాలం అవ‌కాశాలు అందుకున్నా.. అభిన‌యం ప‌రంగా అంతంత‌మాత్ర‌మే అనిపిస్తున్నారు. ఈ అసంతృప్తి చాలాకాలంగా అభిమానుల్లో ఉంది. తెర‌పై అభిన‌యించ‌డం అంటే గ్లామ‌ర్ అండ్ గ్లిట్జ్ చూపించ‌డం ఒక్క‌టే కాదు. స‌న్నివేశానుసారం.. సంద‌ర్భానుసారం అద్భుత‌మైన అభిన‌యం.. హావ‌భావాల‌తో మెప్పించ‌డం. అలా చేయ‌లేని నాయిక‌లు ఎంత అంద‌గ‌త్తెలు అయినా కెరీర్ ప‌రంగా నిల‌దొక్కుకోవ‌డం క‌ష్టం.

ఇక‌పోతే న‌వ‌త‌రం నాయిక‌ల్లో తాప్సీ వ్య‌వ‌హారం గురించి తెలిసిందే. ఈ అమ్మ‌డు దిల్లీ నుంచి వ‌చ్చి టాలీవుడ్‌లో అవ‌కాశాలు అందుకుంది. అంత‌కంటే ముందే ముంబై ర్యాంపుపైనా మెరిసిన అనుభ‌వం ఈ భామ‌కు బాగానే క‌లిసొచ్చింది. అయితే ఎందుక‌నో తెలుగులో పెద్దంత క్లిక్ కాలేదు. ఆ క్ర‌మంలోనే ప‌రిశ్ర‌మ‌పైనా, త‌న‌కు తొలి అవ‌కాశం ఇచ్చిన రాఘ‌వేంద్రుడిపైనా లేని పోని విమ‌ర్శ‌లు చేసి త‌న లేమిత‌నం చూపించింది. ఆ క్ర‌మంలోనే ద‌ర్శ‌కేంద్రుని అభిమానుల‌తో చీవాట్లు తిన్న సంగ‌తి తెలిసిందే. ఇదంతా స‌రే.. ఈ భామ ఓ కార్య‌క్ర‌మంలో త‌న సీనియ‌ర్ నాయిక‌లు అయిన ఖుష్బూ, గౌత‌మి అంత‌టివారితో స‌ర‌దా చాట్ చేసింది. ప్ర‌ఖ్యాత ఆంగ్ల – హిందీ చానెల్ చిట్‌చాట్‌లో సీనియ‌ర్ నాయిక‌ల‌పై ఊహించ‌ని కామెంట్ చేసింది. స‌ర‌దాగా మాట్లాడినా.. తాప్సీ హుషారు లో ఏం మాట్లాడుతోందో అనిపించింది. ఖుష్బూలా మీరూ చేయ‌గ‌ల‌రా? అన్న ప్ర‌శ్న‌కు.. “వీళ్లంద‌రి వీడియోలు చూపించి మ‌రీ అడుగుతున్నారు అభిమానులు. అయినా వాళ్ల‌తో మాకు పోలికేంటి?“ అంటూ నెగెటివ్ కామెంట్ చేసింది. స‌ర‌దా చాట్‌లో ప‌ట్టించుకునేంత పొర‌పాటు కాక‌పోవ‌చ్చు కానీ, తాప్సీ ఇప్ప‌టికీ త‌న గురించి ఎక్కువ‌గానే ఊహించుకుంటోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఒక‌వేళ తాప్సీ అంత ఎక్కువే అయితే టాలీవుడ్‌లో స్టార్‌డ‌మ్ ఎందుకు ద‌క్కించుకోలేక‌పోయింది? త‌న‌తో పాటే ఇదే కార్య‌క్ర‌మంలో ఉన్న చంద‌మామ కాజ‌ల్‌ని చూసి అయినా నేర్చుకోలేదా? అంటూ సెటైర్లు ప‌డుతున్నాయి. తాప్సీకి లేనిది? చ‌ంద‌మామ‌కు ఉన్న‌ది ఏంటి? అంటే అదే క్ర‌మ‌శిక్ష‌ణ‌… నోరు పారేసుకోక‌పోవ‌డం!!