పిక్ టాక్‌ : తాప్సీ అందం చూడ‌త‌ర‌మా?

Tuesday, February 13th, 2018, 10:48:00 PM IST

A post shared by Taapsee Pannu (@taapsee) on

తాప్సీ అంద‌చందాలు చూస్తే మైకం క‌మ్మ‌డం ఖాయం. అంతందంగా బుట్ట‌బొమ్మ‌లా .. మైమ‌రుపులా క‌నిపిస్తోంది ఈ ఫోటోలో. డీప్‌గా చూడ‌క‌పోతే.. తెరిపారా ప‌రిశీలించ‌క‌పోతే గోడ‌పై వేసిన పెయింటింగులా అనిపిస్తుంది. అంతందంగా త‌న‌ని డిజైన్ చేసిన ఆ డిజైన‌ర్ల‌ను ఏమ‌ని పొగ‌డాలి? అంతా ఆ మేక‌ప్‌లోనే దాగి ఉంది.

ఆ డ్రెస్సింగ్ సెన్స్‌.. డిజైన‌ర్‌వేర్‌… చెబుల‌కు పూస‌ల స్టైల్ లోలాకులు.. తీర్చిదిద్దిన ఆ క‌ను రెప్ప‌లు.. డీప్ క‌ల‌ర్ పెద‌వులు.. ఆ లుక్ సింప్లీ ఫెంటాస్టిక్‌. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఎంతో అందంగా క‌నిపించిన తాప్సీ ఎప్ప‌టిక‌ప్పుడు ఫోటోషూట్ ల‌తో అద‌ర‌గొట్టేస్తోంది. తాప్సీ న‌టించిన దిల్ జంగ్లీ రిలీజ్ కి వ‌స్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో వేగం పెంచింది యూనిట్‌. ఇక తాప్సీ న‌టించిన గంగ‌, ఆనందో బ్ర‌హ్మ తెలుగులో బంప‌ర్ హిట్స్‌. అయినా ఈ భామ క్రేజీగా తెలుగు సినిమాల్లో అవ‌కాశం ద‌క్కించుకోలేక‌పోవ‌డం బ్యాడ్‌!

  •  
  •  
  •  
  •  

Comments