మ‌హేష్‌పై తార‌క్ పొగ‌డ్త‌లు చూశారా?

Sunday, April 22nd, 2018, 05:34:39 PM IST

మ‌హేష్ – తార‌క్ ఇద్ద‌రూ `భ‌ర‌త్ అనే నేను` ప్రీరిలీజ్ వేడుక‌లో ఒక‌రినొక‌రు పొగిడేసుకున్న తీరును ఇంకా మ‌ర్చిపోలేం. మ‌హేష్‌ని అన్న అని పిలుస్తాను. మేం మేం బాగానే ఉంటాం.. మీరు జాగ్ర‌త్త‌! అని హెచ్చ‌రించాడు తార‌క్‌. అభిమానుల మంచి కోసం ఉన్న‌మాట చెప్పాడు. మ‌రోసారి త‌న మ‌న‌సును ఆవిష్క‌రించాడు తార‌క్‌.

ఈరోజు తార‌క్ `భ‌ర‌త్ అనే నేను` సినిమా చూశాడు. ఆ వెంట‌నే ట్విట్ట‌ర్‌లో ట‌చ్‌లోకొచ్చాడు. “సామాజిక బాధ్య‌త‌కు క‌మ‌ర్షియాలిటీని జోడించి సినిమా తీయ‌డం అంత ఈజీ కాదు. ఈ రెండు విష‌యాల్ని ఎంతో అందంగా బ్యాలెన్స్ చేశాడు కొర‌టాల‌. అత్య‌ద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచిన మ‌హేష్ అన్న‌కు శుభాకాంక్ష‌లు. మొత్తం టీమ్‌కి శుభాకాంక్ష‌లు. భ‌ర‌త్ నిజాయితీగా తీసిన గొప్ప సినిమా“ అంటూ పొగిడేశాడు తార‌క్‌. ఆ వెంట‌నే రీట్వీట్‌లో తార‌క్‌కు డి.వి.వి సంస్థ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

  •  
  •  
  •  
  •  

Comments