తార‌క్ కోసం రెండెక‌రాల్లో రాయ‌ల‌సీమ గ్రామం?

Monday, April 16th, 2018, 08:50:13 PM IST


ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సినిమా ఇటీవ‌లే ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో భారీ ఫైట్ సీక్వెన్స్‌ని ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే చిత్ర‌యూనిట్ నుంచి ఓ హాట్ అప్‌డేట్ లీకైంది.

ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. అంతేకాదు.. సినిమా కోసం రామోజీ పిలింసిటీలో అదిరిపోయే సెట్ వేశారు. ఇది రాయ‌ల‌సీమ విలేజ్ సెట్‌. దాదాపు రెండెక‌రాల్లో దీనిని నిర్మించారు. ఈ సెట్స్ మ‌ధ్య‌లో ఓ పెద్ద స‌ర‌స్సు కూడా ఉంటుందిట‌. ఇందులో తార‌క్‌పై ఫైట్ సీక్వెన్స్‌ని తెర‌కెక్కిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక భారీ సెట్ కాబ‌ట్టి దీనికి 3-4 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చ‌యి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక ఈ సినిమాని ద‌స‌రా బ‌రిలో రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు ప్ర‌ణాళికా బ‌ద్ధంగా ప్రిప‌రేష‌న్స్‌లో ఉన్నారు. త‌మ‌న్ స్వ‌రాల్ని అందిస్తున్నారు.