టీసీఎస్ కు కొత్త చైర్మెన్ ను ప్రకటించిన రతన్ టాటా…!!

Thursday, November 10th, 2016, 01:08:44 PM IST

eshanth
కంపనీ ఆయన కొత్త చైర్మెన్ గా నియామకం అయినప్పటి నుంచి పలు ఇబ్బందులను ఎదుర్కొంటుందనే నెపంతో ఉన్న పలంగా టాటా అండ్ సన్స్ కంపనీ నుండి సైరస్ మిస్త్రీ ని తొలగించడం జరిగింది. అయితే రతన్ టాటా తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వ్యాపార వర్గాల్లో పెద్ద సంచలనాన్నే రేపిన విషయం అందరికీ విదితమే. అయితే కొత్త చైర్మెన్ నియామకానికి ఇంకా కొంత సమయం తీసుకుంటామని అప్పటి వరకు కంపనీకి తామే చైర్మెన్ గా వ్యవహరిస్తామని అయన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే కొత్త చైర్మెన్ నియామకానికి కనీసం నాలుగు నెలల సమయం అయినా తీసుకుంటుందని చెప్పినా వేగంగానే ప్యానల్ బోర్డు ఈ ప్రక్రియను ముగించింది. ఐటీ దిగ్గజం టీసీఎస్ నూతన చైర్మెన్ గా ఇషాంత్ హుస్సేన్ ను చైర్మెన్ గా నియమిస్తున్నట్లు కొద్దే సేపటి క్రితం టాటా సన్స్ తెలిపింది. ఇషాంత్ వెంటనే పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని తెలిసింది.