షాకింగ్ : బీజేపీ పార్టీలోకి ఆ రెండు పార్టీల నుంచి భారీ చేరికలు.?

Tuesday, June 4th, 2019, 03:26:39 AM IST

ఎన్నికలకు ముందు మరియు ఆ తరవాత అధికార పార్టీలోకి భారీ చేరికలు సహజం కానీ అందుకు భిన్నంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఓటమి పాలైన బీజేపీ పార్టీలోకి చేరికలు భారీగా వస్తున్నాయి అట.అందులోను తెలుగుదేశం మరియు జనసేన పార్టీల నుంచి వలసలు అధికశాతంలో వస్తున్నాయన్న వార్త ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

అయితే ఆంధ్ర రాష్ట్రంలోని గురజాల మరియు మాచర్ల మండలాల నుంచి తెలుగుదేశం మరియు జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కన్నా లక్ష్మి నారాయణ వారందరినీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారట.

ఇప్పుడు ఈ వార్తే అటు తెలుగుదేశం మరియు జనసేన పార్టీ శ్రేణులకు షాకింగ్ గా మారింది.ఇప్పటికే ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఘోరమైన పరాజయం పాలవ్వడంతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నరని అనుకున్నా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలోకి ఎందుకు చేరలేదు అన్న మరో అనుమానం కలుగుతుంది. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని వలసలు ఏ పార్టీలలోకి వెళ్తాయో చూడాలి.