నెల్లూరు తడాఖా: ఆనం బ్ర‌ద‌ర్ 15 కోట్లు ఖ‌ర్చు చేయాలి!

Friday, February 24th, 2017, 01:38:32 PM IST


నెల్లూరు రాజ‌కీయాల్లో ఆనంబ్ర‌ద‌ర్స్‌ది తిరుగులేని ఆధిప‌త్య ం. ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయంటే డ‌బ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖ‌ర్చు చేసేందుకు వెన‌కాడ‌రు. టీడీపీ, వైకాపా మ‌ధ్య ఈసారి వార్ మ‌రింత ముమ్మ‌రం కానుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం దక్కించుకునేందుకు వైకాపా, తేదేపా ఎవ‌రికి వారు కసరత్తు ముమ్మరం చేశారు.

తేదేపా ఎమ్మెల్సీగా వాకాటి నారాయణరెడ్డి పోటీబ‌రిలో దిగుతార‌ని తెలుస్తోంది. అయితే వాకాటి రేంజుకు త‌గ్గ నేత కోసం వైకాపా అంతే సీరియ‌స్‌గా వెతుకుతోంది. ఆనం బ్ర‌ద‌ర్ష్‌లో ఒక‌డైన ఆనం విజ‌య్‌కుమార్ రెడ్డి అయితేనే స‌రైన మందు అని భావించిన వైకాపా అత‌డిని బ‌రిలోకి దించాల‌ని యోచిస్తోంది. విజ‌య్‌కుమార్ రెడ్డి లేదా ఆయ‌న కుమారుడు కార్తీకేయ‌రెడ్డి లో ఎవ‌రో ఒక‌రికి ఇక్క‌డ పోటీ చేసే అవ‌కాశం ఇవ్వాల‌ని వైకాపా అధిష్ఠానం భావిస్తోంది. వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు నేతలు స‌మావేశ‌మై గెలుపు గుర్ర‌మెక్కేందుకు మాష్ట‌ర్ ప్లాన్ సిద్ధం చేశారు. అయితే భారీగా డ‌బ్బు వెద‌జ‌ల్లితేనే ఇక్క‌డ ప‌న‌వుతుంది. దాదాపు 15 కోట్లు ఖ‌ర్చు చేస్తే గెలిచే ఛాన్సుంద‌న్న అంచ‌నా వేశారు. అయితే ఇంత పెద్ద మొత్తం అధికార‌పార్టీ అభ్య‌ర్థిపై గెలిచేందుకు ఖ‌ర్చు చేసేందుకు ఆనం విజ‌య్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? అన్న‌దే ప్ర‌శ్న‌