జ‌గ‌న్‌, చంద్ర‌బాబుకు జేపీ స‌వాల్‌!

Sunday, June 2nd, 2019, 11:36:14 AM IST

ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీకానీ, వైసీనీ కానీ ఒక్కో అభ్య‌ర్థికి 10 నుంచి 15 కోట్లు ఖర్చు పెట్ట‌లేద‌ని వాళ్ల గుండెమీద చెయ్యేసి చెప్ప‌మ‌నండి. నేను బ‌హిరంగంగానే వారికి స‌వాల్ విసురుతున్నాను. టీడీపీ నాయ‌కులు కానీ, వైసీపీ నాకులు కానీ మేము ఒక్కో అసెంబ్లీ స్థానానికి 10 నుంచి 15 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌లేద‌ని, ఓట్లు కొనుగోలు చేయ‌లేద‌ని నాతో నిర్భ‌యంగా, ఎలాంటి మొహ‌మాటం లేకుండా చెప్ప‌గ‌ల‌రా? అంటూ స‌వాల్ విసిరారు లోక్‌స‌త్తా అధినేత‌ జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌. ఈ విష‌యం అంద‌రికి తెలుసు.

ప‌ద‌వి పోతుంద‌ని తెలిసి ఎలాగైనా గెల‌వాల‌న్న ఆకాంక్ష‌తో చంద్ర‌బాబు నాయుడు దాదాపు వేల కోట్లు పంచిపెట్టారు. ఈ ద‌ఫా ఎలాగైనా గెల‌వాల‌న్న కోరిక‌తో వైఎస్ జ‌గ‌న్ 30 నుంచి 40 వేల కోట్ల హ‌మీలిచ్చారు. గెలుపు కోసం నేను హీమీలివ్వ‌లేద‌ని జ‌గ‌న్‌, ప‌ద‌వి కోసం కోట్లు పంచ‌లేద‌ని చంద్ర‌బాబు నాయుడు చెప్ప‌గ‌ల‌రా?. ఇలాంటి వాళ్లా మ‌న నాయ‌కులు. డ‌బ్బు పనిచేయ‌ని చోట కులంతో, మ‌తం, ప్రాంతంతో రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇలాంటి ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌లో గెలుపు గొప్ప విష‌యం కానేకాదు. ఇలాంటి వారి మ‌ధ్య ప‌వ‌న్ రెండు చోట్ల ఓడిపోయార‌న్న‌ది పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన విష‌య‌మే కాదు అని తేల్చేశారు.