వైసీపీపై టీడీపీ తిరుగుబాటుకు ఇక్కడే పునాది వేసిందా.?

Tuesday, September 10th, 2019, 01:59:03 PM IST

ఇప్పుడు ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకు వైసీపీకు మధ్య రాజకీయ వైరం మరింత ఎక్కువయ్యిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఇరు పార్టీల అభిమానులు కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని వైసీపీ వారి అధికార బలంతో టీడీపీ అభిమానులు పై కావాలనే ఇలా దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా పల్నాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి.ఇలా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు వైసీపీపై గట్టి ప్లానే వేసినట్టున్నారని అనిపిస్తుంది.

టీడీపీ అభిమానులను వైసీపీ వారు తరిమేస్తున్నారని భూములు లాక్కుంటున్నారని దాడులు చేస్తున్నారని కుటుంబాలే ఇతర గ్రామాల్లోకి తరలిపోయి తల దాచుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై “చలో ఆత్మకూరు” అనే నినాదంతో చంద్రబాబు తిరుగుబాటు మొదలు పెట్టారు.దీన్ని మాత్రం చంద్రబాబు చాలా సీరియస్ గా మరియు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు ఉన్నారని ఈ విషయం వారు అంత తేలిగ్గా వదిలేలా లేరనిపిస్తుంది.ఒకరకంగా వైసీపీపై తిరుగుబాటుకు ఇదే పునాది అని చెప్పినా ఆశ్చర్య పడక్కర్లేదు.మరి చంద్రబాబు దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారో చూడాలి.