మంచిపాలనకు నిదర్శనం నందిగామ విజయం

Tuesday, September 16th, 2014, 01:20:02 PM IST


వందరోజుల పాలనను ప్రజలు మెచ్చుకున్నారని.. దానికి నిరర్శనమె నందిగామలోతెలుగుదేశం పార్టీ సాధించిన విజయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆ స్థానంలో విజయం సాధించిన తంగిరాల సౌమ్యకు బాబు అభినందనలు తెలియజేశారు.
త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు. రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. వరల్డ్ క్లాస్ రాజధానిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలియజేశారు.