జగన్ రెడ్డి సర్కార్ కొవిడ్ బాధితుల్ని గాలికొదిలేసింది – టీడీపీ

Wednesday, April 28th, 2021, 10:54:19 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మరొకసారి తెలుగు దేశం పార్టీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. జగన్ రెడ్డి సర్కార్ కొవిడ్ బాధితుల్ని గాలికి వదిలేసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కరోనా కంటే ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు ఎదురవుతున్న నిర్లక్ష్యమే మరణాలకు కారణం అవుతుంది అంటూ తెలుగు దేశం పార్టీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే విశాఖ పట్నం లోని కేజీహెచ్ లో కరోనా పేషంట్ అయినటువంటి మహిళను ఆసుపత్రి లో చేర్చుకోకుండా నడిరోడ్డు పై వదిలేశారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే బెడ్లు, ఆక్సిజన్ కొరత లేదంటున్న ప్రభుత్వం కరోనా రోగుల పట్ల అమానవీయ ప్రవర్తన కి ఏం సమాధానం చెబుతుంది అంటూ సూటిగా నిలదీయడం జరిగింది.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో బెడ్ల కొరత లేదని, ఆక్సిజన్ కొరత లేదని పలు మార్లు చెప్పుకొచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఈ కరోనా వైరస్ పేషంట్ ను ఆసుపత్రి లో చేర్చుకొక పోవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరి దీని పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వరుస తప్పిదాలను తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించే ప్రయత్నం చేస్తోంది.