ఆనందయ్య మందు పంపిణీ విషయంలో వైసీపీ కి టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్!

Tuesday, June 8th, 2021, 07:28:42 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి కి నెల్లూరు కృష్ణపట్నం కి చెందిన ఆనందయ్య నాటు మందు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మందు కరోనా వైరస్ పై సమర్థవంతంగా పనిచేస్తుంది అని పలువురు భావిస్తున్నారు. ఇటీవల ఈ మందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, యంత్ర సామాగ్రి కూడా లేక పోవడం తో సర్వేపల్లి నియోజక వర్గం ప్రజలకు మాత్రమే మందు పంపిణీ జరుగుతుంది. అయితే ఈ మందు ను వైసీపీ నేతలు పంపిణీ చేస్తున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఆనందయ్య మందు పంపిణీ విషయం లో వైసీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పబ్లిసిటీ చేసుకుటుంది అని టీడీపీ ఒక విడియో రూపం లో వెల్లడించింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు వైఎస్సార్ ల బొమ్మ లతో ఆనందయ్య మందు ను పంపిణీ చేస్తున్న వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది టీడీపీ. ఇలా పబ్లిసిటీ చేస్తూ ఉంటే, శవాల మీద చిల్లర వేరుకున్నట్లుగా ఉందని జగన్ చేసిన వ్యాఖ్యల నే వీడియో లో పెట్టడం గమనార్హం. అయితే దీని పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.