టీడీపీనీ వీడనున్న మాజీ ఎమ్మెల్యే.. షాక్‌లో చంద్రబాబు..!

Monday, October 14th, 2019, 06:36:11 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిచి రెండో సారి అధికారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత వరుసగా రెండోసారి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచిన, లోక్‌సభ ఎన్నికలలో మాత్రం అనుకున్న స్థానాలను గెలుచుకోలేకపోయింది.

అయితే అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైన బీజేపీ, లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకుని ఏకంగా నాలుగు స్థానాలను గెలుచుకుంది. అయితే కేంద్రంలో ఎలాగో బీజేపీ అధికారంలోకి రావడంతో తెలుగు రాష్ట్రాలలో మరింత పట్టును పెంచుకునేందుకు బీజేపీ ఆకర్ష్ మొదలుపెట్టింది. అటు ఏపీలో ఇప్పటికే టీడీపీనీ వీడి చాలా మంది నేతలు బీజేపీలో చేరిపోయారు. అయితే తెలంగాణలో కూడా టీడీపీ నేతలు, టీఆర్ఎస్ నేతలు పార్టీనీ వీడి బీజేపీలో చేరిపోయారు. అయితే తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ బీజేపీలో చేరేందుకు రెడీ అయిపోయారు. అంతేకాదు ఆమె కుమారుడు డాక్టర్ మల్లికార్జున రెడ్డి కూడా టీడీపీనీ వీడబోతున్నారు. అయితే ఉమ్మడి ఏపీలో 2009 ఎన్నికలలో టీడీపీ తరుపున గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన అన్నపూర్ణమ్మ 2014 ఎన్నికలలో కూడా టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కలిసి అన్నపూర్ణమ్మ నివాసంలో భేటీ అయ్యారు. అయితే పార్టీ మార్పు విషయంపై ఆమె అనుచరులతో సంప్రదింపులు జరిపారు. అయితే ఈ నెల 18వ తేదిన లేదా ఈ నెల ఆఖరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆమె బీజేపీ పార్టీలో చేరడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.