టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. షాక్‌లో చంద్రబాబు..!

Friday, October 18th, 2019, 04:23:44 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు చేసిన అక్రమాలను, దోపీడీలను ఆధారాలతో సహా వెలికితీస్తూ వైసీపీ ప్రభుత్వం వారిపై కేసులు నమోదు చేయిస్తుంది. అయితే ఇప్పటికే చింతమనేని వంటి పలువురు నెతలపై కేసులు పెట్టి జైళ్ళకు పంపిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదయ్యింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన తెదేపా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల కొత్తూరు మండలం మాతల గ్రామంలో సామాజిక భవనానికి వైసీపీ రంగులు వేస్తుండడంతో వెంకటరమణ మరియు పలువురు దానిని అడ్డుకున్నారు. అయితే ఆ సమయంలో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, సీఎం జగన్‌పై అసభయ పదజాలం వాడారంటూ బూరాడ నాగరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే వెంకటరమణతో సహా మరో 17 మందిపై కేసులు నమోదు చేసి కొత్తూరు కోర్ట్‌లో హాజరుపరిచారు.