అమరావతి రాజధానిలో స్టార్ట్ అప్ ప్రాజెక్టు విషయం లో టీడీపీ నేతలు జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విషయం లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పట్టు విడవడం లేదు. ఈ విషయం లో కర్ణాటక కి చెందిన పారిశ్రామిక వేత్త పలు విషయాల్ని తెలియజేసాడు. జాతీయ మీడియా కూడా దేశం పై ప్రభావం చూపించేలా జగన్ నిర్ణయాలు ఉన్నాయని తెలుపుతున్నారు. అయితే దీనికి సంబందించిన విషయాల్ని తెలుగు దేశం పార్టీ బట్ట బయలు చేసింది.
ఐదేళ్ల చంద్రబాబు కష్టం ఐదు నెలల్లో బూడిద పాలు అంటూ తెలుగు దేశం పేర్కొంది. రాజధాని అమరావతి నిర్మాణానికి చంద్రబాబ నాయుడు పడిన కష్టం అంత ఇంతా కాదు. అయితే జగన్ పని తీరు పై వస్తున్న విమర్శలనుద్దేశించి పలు వ్యాఖ్యలు పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గురించి మొన్న అదానీ, నిన్న అంబానీ, నేడు సింగపూర్ కంపెనీ, ఇపుడు దేశం వైసీపీ పాలకుల అసమర్ధత గురించే చర్చిస్తుందని పేర్కొనడం జరిగింది. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ నెటిజెన్లు ఇలా కామెంట్లు చేస్తున్నారు. 6 నెలల్లో దేశం మొత్తం మనవైపు చూసేలా చేస్తాను అన్న మాటలని ఈ సందర్భానికి అనునయించుకుంటున్నారు.
సింగపూర్ కంపెనీలు అమరావతి నుంచి వెళ్ళిపోవడం ఏపీకి చెడు వార్తని కర్ణాటకకు చెందిన పారిశ్రామికవేత్త వ్యాఖ్యానిస్తే, ఏపీలో ఏం జరుగుతోందని ఆశ్చర్యపోతోంది జాతీయ మీడియా. చంద్రబాబు ఐదేళ్ళ కష్టాన్ని 5 నెలల్లో బూడిదపాలు చేసిన వైసీపీ సర్కారు అసమర్థత గురించి ఇప్పుడు దేశమంతా చర్చిస్తోంది pic.twitter.com/azL5WIZUtZ
— Telugu Desam Party (@JaiTDP) November 13, 2019