బీసీ నాయకుడిని అన్యాయం గా ఇరికించే కుట్ర ఇది – టీడీపీ

Sunday, July 5th, 2020, 04:16:20 PM IST

రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొల్లు రవీంద్ర లాంటి మంచి బీసీ నాయకుడిని అన్యాయం గా ఇరికించే కుట్ర ఇది అని టీడీపీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ఈ వ్యవహారం లో టీడీపీ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మోక భాస్కర్ రావు ఒక రౌడీ షీటర్ అని, 2013 ఉల్లింగి పాలెం లో చింతా చిన్ని అన్న సురేంద్ర ను, అత్యంత కిరాతకంగా భార్య చిన్న పిల్లల ముందే కత్తులతో నరికి చంపించాడు అని వ్యాఖ్యానించారు.

అయితే జూన్ 30 వ తేదీన, రౌడీ షీటర్ ను చంపిన, చింతా చిన్ని తో పాటు అతని అన్న కొడుకులు ఇద్దరు పోలీసుల ఎదుట లొంగిపోతే జూలై 2 న ప్రెస్ మీట్ పెట్టీ, వారిని ఈరోజు పట్టుకున్నం అని పోలీసులు చెప్పడం వెనుక ఉన్న కుట్ర ఏమిటి అని టీడీపీ నిలదీసింది. కొల్లు రవీంద్ర పేరు ఇరికించడానకి కుట్ర పన్నారు అని టీడీపీ వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాక హత్య జరిగిన రోజు సైతం అన్ని పత్రికల్లో పాత కక్షల వలన హత్య జరిగింది అన్నట్లు వార్తలు వచ్చిన విషయం గుర్తు చేసింది. అంతేకాక ఈ రెండు రోజుల్లో కొల్లు రవీంద్ర పేరు బయటికి వచ్చింది అని తెలిపింది. ఇదంతా జగన్ మోహన్ రెడ్డి కుట్ర అంటూ టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది.