దళితుల పై వైసీపీ దమన కాండ సాగిస్తోంది

Thursday, July 30th, 2020, 03:00:09 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో జరుగుతున్న పలు పరిణామాల పై తెలుగు దేశం పార్టీ కన్నెర్ర జేసింది. దళితుడైన కిరణ్ ను కొట్టి చంపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలుగు దేశం పార్టీ జగన్ సర్కార్ ను సూటిగా నిలదీస్తూ పలు ప్రశ్నలను సంధించింది. దళితుల పై వైసీపీ దమన కాండ సాగిస్తోంది అని, వైసీపీ అధికారం లోకి వచ్చాక 100 చోట్ల దళితుల పై దాడులు, దౌర్జన్యాలు జరగడం దారుణం అని తెలిపింది. అయితే మాస్క్ లేదన్న కారణం తో పోలీసులు దళిత యువకుడిని కొట్టి చంపడం ప్రభుత్వ దమన కాండ కి పరాకాష్ట అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఒక చోట మాస్క్ పెట్టుకోలేదు అని ఒక యువకుడి నీ కొట్టి చంపిన ప్రభుత్వం, మరో చోట పెట్టుకోడానికి మాస్క్ ఇమ్మని అడిగిన పాపానికి ఒక దళిత వైద్యుడిని హింసించి,.పిచ్చివాడిని చేసే ప్రయత్నం చేసింది అని తెలిపింది. అయితే మాస్క్ అన్నది ఇక్కడ కారణం కాదు అని, దళితుల అణచివేత లక్ష్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. జగన్ మోహన్ రెడ్డి పాలన లో ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల టీడీపీ ఆందోళన వ్యక్తం చేయడం తో పాటుగా, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.