బిగ్ బ్రేకింగ్: వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత..!

Thursday, February 13th, 2020, 03:40:59 PM IST

ఏపీలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. అయితే తాజాగా కర్నూల్ జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ విక్టర్ వైసీపీలో చేరిపోయారు. అయితే కొద్ది రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన ఈయన నేడు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

అయితే టీడీపీకి రాజీనామా చేసిన ఈయన టీడీపీపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ తీసుకొచ్చిన వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవడం దారుణమని, కర్నూల్‌కి హైకోర్ట్ రావడం ఇక్కడి టీడీపీ నేతలకు ఇష్టం లేదని అందుకే తాను పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే రాజీనామా అనంతరం కార్యకర్తలతో చర్చించిన విక్టర్ నేడు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఈయనతో పాటు మున్సిపల్ మాజీ ఛైర్మన్ సుబ్బమ్మ, పలువురు మాజీ కౌన్సిలర్లు, ఆయన అనుచరులు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు.