సీఎం జగన్ అవినీతిపై చర్చకు సిద్దమా.. టీడీపీ నేత అనురాధ డిమాండ్..!

Saturday, February 15th, 2020, 03:00:42 AM IST

ఏపీ సీఎం జగన్ అవినీతిపై వైసీపీ నేతలుచర్చకు రావాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ డిమాండ్ చేశారు. నేడు విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మొత్తం పదహారు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ పదహారు నెలలు జైల్లో కూడా ఉన్నారని చెప్పారు. అయితే ఎనిమిదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, జగన్ కు సంబంధించిన నలభై మూడు వేల కోట్ల రూపాయలను సీబీఐ ఇప్పటికే జప్తు చేసిందంటూ విమర్శలు చేశారు.

అయితే శ్రీకాకుళం, విశాఖ, విజయనగరంలో ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎకరాలను జగన్ కొట్టేశారని అను రాధ ఆరోపించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 10,835 ఎకరాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో 51,641 ఎకరాలు కొట్టేశారని, ఈ విషయాల గురించి ఒక్క వైసీపీ నాయకుడు కూడా నోరెత్తడని, దమ్ముంటే వైసీపీ నేతలు వీటి గురుంచి చర్చించేందుకు రావాలని అనురాధ కోరారు.