విజయసాయి రెడ్డి ట్విట్టర్ డెవిల్.. టీడీపీ మహిళా నేత సీరియస్..!

Tuesday, June 2nd, 2020, 01:40:48 AM IST


వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపీ టీడీపీ మహిళా నాయకురాలు పంచుమర్తి అనురాధ సీరియస్ అయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఒక ట్విట్టర్‌ డెవిల్‌ అని, వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను మరింత నాశనం చేయడానికి విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టారని మండిపడ్డారు.

ఇకపోతే విజయసాయిరెడ్డి ఏమాత్రం పరివర్తన లేకుండా మాట్లాడారని అన్నారు. సొంత బాబాయ్‌ని హత్య చేస్తే గంటకూడా అనుమానితుల్ని విచారించలేదని, ఒక పోస్ట్‌ షేర్‌ చేసినందుకు రంగనాయకమ్మను విచారణ పేరుతో 8 గంటలు కూర్చోబెట్టారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు మచ్చలేని వ్యక్తి అని ఇప్పటి వరకు కోర్టు గడపకూడా తొక్కలేదని అన్నారు.