అచ్చెన్నాయుడికి షాకిచ్చిన కోర్టు.. జూలై వరకు రిమాండ్ పొడిగింపు..!

Saturday, June 27th, 2020, 10:35:35 PM IST

టీడీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రిమాండ్ గడువును జూలై వరకు కోర్టు పొడిగించింది. అచ్చెన్నాయుడు సహా 8 మంది పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పు నేపథ్యంలో అచ్చెన్న తరఫు న్యాయవాది హరిబాబు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఇబ్బందుల నడుమ అచ్చెన్నాయుడు కస్టడీ ముగిసిందన్నారు.

అంతెకాదు సుధీర్ఘ విచారణలో ఏసీబీ అధికారులు ఏం సాధించలేకపోయారని, బ్లడ్ మోషన్స్ అవుతున్నప్పటికి అచ్చెన్నాయుడు అధికారులకు సహకరించారని అన్నారు. టెలీ హెల్త్ సర్వీస్ పరికరాల కొనుగోలు విషయంలో ఇచ్చిన లేఖలపైనే విచారణ జరిగిందని, రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని అన్నారు. ఏదేమైనా న్యాయం గెలుస్తుందని, అచ్చెన్నాయుడు నిర్దోషిగా బయటకు వస్తారని అన్నారు.