బ్రేకింగ్: టీడీపీనీ వీడి బీజేపీలో చేరనున్న సినీనటి..!

Tuesday, August 13th, 2019, 05:35:34 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిచి రెండో సారి అధికారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత వరుసగా రెండోసారి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచిన, లోక్‌సభ ఎన్నికలలో మాత్రం అనుకున్న స్థానాలను గెలుచుకోలేకపోయింది.

అయితే అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైన బీజేపీ, లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకుని ఏకంగా నాలుగు స్థానాలను గెలుచుకుంది. అయితే కేంద్రంలో ఎలాగో బీజేపీ అధికారంలోకి రావడంతో తెలుగు రాష్ట్రాలలో మరింత పట్టును పెంచుకునేందుకు బీజేపీ ఆకర్ష్ మొదలుపెట్టింది. అటు ఏపీలో ఇప్పటికే టీడీపీనీ వీడి చాలా మంది నేతలు బీజేపీలో చేరిపోయారు. తెలంగాణలో కూడా డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, వివేక్ వంటి ముఖ్య నేతలు ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. అయితే తాజాగా టీడీపీ నాయకురాలు సినీనటి రేవతి చౌదరి టీడీపీనీ వీడి బీజేపీలో చేరడానికి రెడీ అయిపోయారు. అయితే నేడు కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఢిల్లీలో కలిసారు. అయితే ఈ ఎన్నికల ముందు టీడీపీలో చేరిన రేవతి చౌదరికి టీడీపీ అధికార ప్రతినిధిగా చంద్రబాబు అవకాశం కల్పించారు. అయితే నేడు మీడియాతో మాట్లాడిన రేవతి చౌదరి త్వరలోనే తాను బీజేపీలో చేరుతున్నానని ప్రకటించింది.