సీఎం జగన్‌ని పిచ్చాసుపత్రిలో చేర్చాలి.. టీడీపీ మహిళా నేత సీరియస్..!

Friday, May 29th, 2020, 07:47:47 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వి.అనిత మండిపడ్డారు. అయితే విశాఖలోని మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న నర్సీపట్నం డాక్టర్ సుధాకర్‌ను టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలసి ఆమె పరామర్శించారు. ఈ సందర్భగా మీడియాతో మాట్లాడిన అనిత జగన్ సర్కార్‌పై మండిపడింది.

అయితే మానసిక వైద్యశాలకు తరలించాల్సింది డాక్టర్ సుధాకర్‌‌ను కాదని, జగన్‌ను చేర్చాలని అన్నారు. ఆస్పత్రిలో సుధాకర్‌కు ప్రాణహాని ఉందని అతడి తల్లి తనకు ఫోన్ చేసి చెప్పిందని చెప్పుకొచ్చింది.