ఈ ఉపఎన్నికలో వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడింది – అచ్చెన్నాయుడు

Monday, April 19th, 2021, 03:06:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక విషయం కి అధికార పార్టీ వైసీపీ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే లు తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో దొంగ ఓట్లు వేయించి తమపై ఎదురుదాడి చేస్తున్నారు అంటూ అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఉపఎన్నికలో వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే తిరుపతి వెంకన్న సాక్షిగా ఈ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ అధికార పార్టీ వైసీపీ కి అచ్చెన్న సవాల్ విసిరారు.

అయితే దొంగ ఓట్ల విషయం లో ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహించడం దారుణం అంటూ చెప్పుకొచ్చారు. ఒక్క దొంగ ఓటు కూడా పడలేదు అని వైసీపీ నేతలు వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక దొంగ ఓట్ల పై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలి అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. అయితే తిరుపతి ఉపఎన్నికలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు పడ్డాయి అంటూ అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఎన్నిక లో దొంగ ఓట్లు పడ్డాయి అని, రీ పోలింగ్ నిర్వహించాలి అంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.