హాట్ టాపిక్: ఇంతకీ బాబాయి ని చంపింది ఎవరు?–జగన్ కి టీడీపీ నేత సూటి ప్రశ్న

Thursday, February 13th, 2020, 02:40:32 PM IST


ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. మరొకసారి వైయస్ వివేకా నంద హత్య కేసు ఫై జగన్ ప్రభుత్వానికి సంచలన ప్రశ్నలు సంధించారు. బాబాయ్ ని చంపింది ఎవరు? ఎన్నికల ముందు సిబిఐ విచారణ కోరిన వ్యక్తులు ఇపుడు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. సొంత చెల్లి ప్రభుత్వం ఫై నమ్మకం లేదంటూ కోర్ట్ మెట్లెక్కడం వెనుక మర్మం ఏమిఅతని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.

జగన్ పనితీరు ఫై వైసీపీ నేతలు ప్రశంసలు గుప్పిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. 7 రోజుల్లో కేసును చేధించే దమ్మున్న ప్రభుత్వం అని డప్పు కొట్టుకుంటున్న వారు సొంత బాబాయ్ హత్య కేసు ని ఎందుకు ఛేదించ లేకపోతున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇంతకీ బాబాయ్ ని చంపింది ఎవరు?బాబాయ్ హత్య వెనుక ఉన్న కుట్ర ఏమిటి? హూ కిల్డ్ బాబాయ్?రాష్ట్రాన్ని వేధిస్తున్న ఈ ప్రశ్నకి సమాధానం ఎపుడు? అని వరుస ప్రశ్నలు వేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై సొంత వ్యక్తుల నుండి వ్యతిరేకత రావడం తో టీడీపీ నేతలు కాస్త విమర్శలు ఎక్కువగా చేస్తున్నారని చెప్పాలి.