బిగ్ న్యూస్: వైయస్ జగన్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత

Monday, March 30th, 2020, 06:49:23 PM IST


తెలుగు దేశం పార్టీ నేత బుద్దా వెంకన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజల కోసం నిలబడిన వాడు ఎవరో, ప్రజలు పోయినా పర్వాలేదు నాకు ఎన్నికలే ముఖ్యం అన్నవాడు ఎవరో ప్రజలందరికి తెలుసు విజయసాయి రెడ్డి గారు అని బుద్దా వెంకన్న అన్నారు. విదేశాల నుండి 29 వేల మంది వస్తే ఇప్పటి వరకూ మీ ప్రభుత్వం 600 మందికి మాత్రమే టెస్టులు చేసింది అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు బుద్దా వెంకన్న.

అయితే క్వారంటైన్ల లో వసతులు చూస్తుంటే వాంతులు వస్తున్నాయి అని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. కనీసం క్వారంటైన్ లో మంచి భోజనం కూడా పెట్టలేని చెత్త ప్రభుత్వం మీది అని విమర్శించారు. 29 వేల మంది కనీసం నలుగురు కుటుంబ సభ్యులను కలుస్తారు, అంటే లక్ష కి తగ్గకుండా టెస్టులు చెయ్యాలి అని స్పష్టం చేశారు. అసలు టెస్టులే చెయ్యకుండా కరోనా ని ఎదుర్కున్న వీరుడు జగన్ అంటూ డప్పు కొట్టుకోవడం మీకు ఆనందాన్ని ఇస్తే కొట్టుకోండి అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ప్రజల జీవితాలతో ఆడుకోకండి అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికే జగన్ గారి అసమర్ధ పాలన కారణంగా కచ్చులూరు బోటు ప్రమాదంలో 51 మంది జల సమాధి అయ్యారు అని సంచలన ఆరోపణలు చేశారు.

రైతులకు కనీసం విత్తనాలు,ఎరువులు ఇవ్వకుండా 500 మంది రైతులను బలితీసుకున్నారు అని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. మూడు ముక్కలాట తో 60 మంది రైతుల గుండెలు ఆగడానికి కారణం అయ్యారు అని, కృత్రిమ కొరత సృష్టించి 70 మందిని మింగేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.