ఏపీకి వెళుతున్న చంద్రబాబు.. అనుమతించడంటూ డీజీపీకి లేఖ..!

Sunday, May 24th, 2020, 12:55:24 AM IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఏపీకి వెళ్ళేందుకు రెడీ అయ్యారు. లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇచ్చిన నేపధ్యంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖ బయలుదేరనున్నారు.

అయితే తనను తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళేందుకు అనుమతించాలని ఇరు రాష్ట్రాల డీజీపీలకు లేఖ రాశారు. తెలంగాణ డీజీపీ అందుకు అనుమతి ఇవ్వగా, ఏపీ డీజీపీ నుంచి ఇంకా ఎలాంటి అనుమతి రాలేదు. దీంతో అసలు చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తుందా, ఒకవేళ అనుమతిస్తే ఎలాంటి షరతులతో అనుమతులు మంజూరు చేస్తుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.