ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పుబడుతున్న టీడీపీ నేత… ?

Monday, August 12th, 2019, 08:52:56 PM IST

ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని సొంతం చేసుకున్న తరువాత ప్రతిపక్ష పార్టీ టీడీపీ మీద వైసీపీ అధినేత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని గత కొంత కాలంగా టీడీపీ నేతలు చెప్పుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. అయితే అంతకంతకు అధికారపార్టీ చేసిన తప్పులను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నారు టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. కాగా తాజాగా నారా లోకేష్ మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఇలాంటి వాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు వాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిజం చేసి చూపించారని నారా లోకేష్ చెప్పారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా మధ్య నిషేధంపై సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ “మద్యం మానవ సంబంధాలను మంటగలుపుతుందని” చెప్పారు.

అయితే తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం సీఎం జగన్ చేసిన వాఖ్యాలని నిజం చేసి చూపించారని నారాలోకేష్ అన్నారు. కోటంరెడ్డి మందుతాగి విలేఖరి ఇంటికి వెళ్లి దాడి చేసి బెదిరించారని, జగన్ కూడా నన్నేమీ చేయలేడు అని, సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి పరువే తీశారని నారాలోకేష్ అన్నారు. దానికితోడు అసెంబ్లీ సమావేశాల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఎమ్మెల్యే కోటంరెడ్డి ఖబడ్దార్‌ అని బెదిరించగా, అది చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవ్వుకున్నారని ఈసందర్భంగా లోకేష్ గుర్తు చేశారు. అయితే చంద్రబాబు పై తన దారుణమైన ప్రవర్తనను చూపిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన మొహాన్ని ఎక్కడ దాచుకుంటాడో అని నారా లోకేష్ అన్నారు. అందుకే ఏదైనా పని చేసేముందు అన్నిరకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నారా లోకేష్ అన్నారు.