నన్ను జైలులో పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటా – దేవినేని ఉమా

Thursday, April 29th, 2021, 12:23:59 PM IST

తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజి మంత్రి దేవినేని ఉమా మరొకసారి అధికార పార్టీ వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మాటల మార్ఫింగ్ వీడియో కేసులో నేడు సీఐడీ విచారణకు ఉమా హాజరు అయ్యారు. అయితే సీఎం జగన్ మాటలను మార్ఫింగ్ చేశారనే ఆరోపణల పై తన పై తప్పుడు కేసులు బనాయించారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే న్యాయ వ్యవస్థ పై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. అయితే అక్రమ కేసుల పై కోర్టుల్లో పోరాడతా అని వ్యాఖ్యానించారు. అయితే హైకోర్ట్ ఆదేశాల మేరకు సీఐడీ కార్యాలయం లో విచారణ కి హాజరు అవుతున్నా అని అన్నారు.

అయితే కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్నా పట్టించుకోని సీఎం, పాలనను గాలికొదిలేశారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టించుకోవడం లేదని, వైసీపీ ప్రభుత్వానికి మానవత్వం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు పెట్టి తన గొంతు నొక్కలేరు అని అన్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తం గా ఉందని పేర్కొన్నారు. అయితే నన్ను జైలులో పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటా అంటూ చెప్పుకొచ్చారు. అయితే కరోనా వైరస్ సమయం లో విచారణకు హాజరు కావాల్సి వస్తుంది అని, ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటి అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే అమూల్ కోసం సంగం డెయిరీ ఆస్తులను తాకట్టు పెట్టాలనే యత్నం చేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ప్రభుత్వ మెప్పు కోసం కొందరు అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అంటూ మండిపడ్డారు. అయితే దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.