షాకింగ్ : బీజేపీ లోకి వెళ్లనున్న గంటా – చీలిక మొదలయిందా…?

Saturday, November 9th, 2019, 02:00:49 AM IST

గత కొద్దీ రోజులుగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నటువంటి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పు వివాదానికి చివరికి తెరపడింది. ఎట్టకేలకు ఆయన టీడీపీ ని వదిలి బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు కూడా. కాగా గంటా మొదట్లో వైసీపీ లో చేరడానికి సిద్దపడగా, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి కండిషన్ల ద్వారా, చివరికి తన మనసు మార్చుకొని గంటా బీజేపీ లో చేరడానికి సిద్ధమయ్యారు. ఈమేరకు గంటా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రామ్ మాధవ్ తో చర్చలు జరిపినట్లుగా సమాచారం. ఇకపోతే బీజేపీ లో చేరిన తరువాత గంటా కి మంచి పదవి అప్పగిస్తున్నారన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇక్కడే ఒక కొత్త చిక్కు వచ్చింది. గంటా తో పాటే పార్టీ వీడటానికి చాలా మంది వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల టీడీపీ ని వైసీపీ లో చేరినటువంటి వల్లభనేని వంశీ కూడా గతంలో బీజేపీ లో చేరతారని అందరు భావించినప్పటికీ కూడా చివరికి ఆయన చివరికి మనసు మార్చుకున్నారని సమాచారం. ఏదేమైనప్పటికి కూడా గత కొద్దీ కాలంగా టీడీపీ లో కీలకంగా ఉన్నటువంటి సీనియర్ నేతలు అందరు కూడా పార్టీ మారుతుండటంతో అధినేతకు పెద్ద తలనొప్పిగా మారింది. కాగా గంటా తో పాటే ఎవరెవరు వెళ్తారనేది ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది.