బ్రేకింగ్: వైసీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ నేత..!

Friday, October 18th, 2019, 06:02:20 PM IST

ఏపీలో ప్రస్తుత రాజకీయాలు రసవత్తరంగా మారాయనే చెప్పాలి. మునుపెన్నడు లేని విధంగా టీడీపీ ఓటమి పాలవ్వడంతో ఆ పార్టీలోని నేతలంతా ఇతర పార్టీలలోకి వలసలు కట్టారు. అయితే టీడీపీలో ఉన్న చాలా మంది నేతలు పార్టీనీ వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోతున్నారు. అయితే ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు మరియి కొందరు సీనియర్ నేతలు టీడీపీనీ వీడి బీజేపీలో, మరికొందరు నేతలు వైసీపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే.

అయితే గత కొద్ది రోజుల నుంచి టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా వైసీపీలోకి చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు జోరందుకున్నాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన తన పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పందించారు. తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తవమని, తాను ఆఖరి వరకు టీడీపీలోనే కొనసాగుతానని, పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజలకు మేలు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.