సీఎం జగన్‌కి దమ్ముందా.. టీడీపీ నేత అల్టీమేట్ సవాల్..!

Friday, February 14th, 2020, 07:58:41 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన పట్టాభి సీఎం జగన్‌కి దమ్ముంటే ఆయనపై ఉన్న కేసులపై విచారణకు సహకరించాలని సవాల్ విసిరారు. పాలన పేరు చెప్పి కోర్ట్ వాయిదాలు తప్పించుకోవడం కాదని దమ్ముంటే విచారణకు సహకరించాలని అన్నారు. అయితే 420పనులు చేసి, అక్రమాలకు పాల్పడి జగన్ వేల కోట్లు దండుకున్నారని విమర్శలు గుప్పించారు.

అయితే రాష్ట్ర ప్రతిష్టను జగన్ అధికారంలోకి వచ్చి దిగజార్చారని, చంద్రబాబుపై మీలా అక్రమ కేసులు, మనీ ల్యాండరింగ్ కేసులు లేవని అన్నారు. అయితే మహిళలపై నేరాల్లో ఏపీ దేశంలోనే మూడవ స్థానంలో ఉందని సెజ్‌ల పేరుతో రసల్‌ ఖైమా కంపెనీని మోసం చేయలేదా అని ప్రశ్నించారు. అంతేకాదు సెర్బియాలో మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌ని అరెస్ట్‌ చేస్తే అతన్ని విడిపించడానికి వైసీపీ ఎంపీలు ఢిల్లీ దాక వెళ్ళారని అన్నారు.