వైకాపా కి కొత్త అర్థం చెబుతున్న టీడీపీ నేత…

Saturday, August 24th, 2019, 03:06:04 AM IST

రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి చాలా దారుణంగా మారిపోతున్నాయి… రాజకీయాల పరంగా మొదలైన పోరు ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరిమీదకు మారుతున్నాయో కూడా అర్థం కానీ పరిస్థితి మన రాష్ట్ర రాజకీయాలకు ఎదురైంది. కాగా తాజాగా తిరుమల తిరుపతిలో అన్యమత ప్రచారం వివాదం కొత్తగా ప్రారంభం అయి అందరిని కూడా మార్చేస్తున్నాయి,…. ఈ గొడవ వలన ఆంధ్రప్రదేశ్ లోని అధికార మరియు ప్రతిపక్షాల మధ్య గొడవలు తీవ్రంగా మారుతున్నాయని చుస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్యన గొడవలతో పాటే కొత్తగా కొత్త కొత్త డైలాగులు కూడా వస్తున్నాయి… అయితే మేరకు టీడీపీ నేత, మాజీ టీటీడీ మాజీ సభ్యుడు ఏవీ రమణ ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ వైకాపా పార్టీ కి కొత్తగా అర్థాన్ని చెప్పారు… అదేంటంటే…

వై – వైషమ్యాలు

కా – కార్పణ్యాలు

పా – పాపాలు…

ఈమేరకు తాజా టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మీద పరోక్షముగా కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. మిరే కావాలని కులాలు, మతాలూ పేరుతొ గొడవ రాజేసి ఇపుడు ఆతప్పును ప్రతిపక్ష పార్టీ మీదకి నెట్టేయడం మీకు సమంజసం కాదని కొత్త టీటీడీ చైర్మన్ ని ఉద్దేశించి మాట్లాడారు. మీ చేతకాని తనాన్ని పక్క వారిమీదకు నెట్టడం అనేది మీ ప్రభుత్వ వైఫల్యం అని అర్థమవుతుంది. ఇకపోతే ప్రజలందరి మెప్పుపొందేలా అన్ని ప్రయత్నాలు చేస్తూ మీ పనులు మీరు సక్రమంగా చేయండి కానీ ఇలా మీ తప్పులను కప్పిపెట్టడానికి పక్కవారిమీద ఇలాంటి నిందలు వేయడం కరెక్టు కాదని ఏవి రమణ వాఖ్యానించారు… అంతేకాకుండా ఎవరు ఏంటో ప్రజలందరికి తెలుసనీ, ఇకనుండైనా మీరు జాగ్రత్తగా ఉండటం మంచిదని హెచ్చరించారు.