టీడీపీ నేత సంచలన ట్వీట్.. శభాశ్ అంటున్న తెలుగు తమ్ముళ్ళు..!

Tuesday, October 8th, 2019, 08:32:57 PM IST

ఏపీలో ప్రస్తుత రాజకీయాలు ఎంతో రసవత్తరంగా మారిపోయాయి. ఈ సారి ఎన్నికలలో టీడీపీ మునుపెన్నడూ లేని విధంగా ఓటమిపాలవ్వడంతో టీడీపీ నేతలంతా పార్టీనీ వీడి వైసీపీలో, బీజేపీలో చేరిపోతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి సోదరుడు సన్యాసి పాత్రుడు టీడీపీకి రాజీనామా చేసి త్వరలోనే వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. అయితే తమ్ముడి పార్టీ మార్పుపై స్పందించిన అయ్యన్నపాత్రుడు ఫేస్‌బుక్ ద్వారా సంచలన పోస్ట్ చేశారు.

అయితే నాకు పార్టీ పదవులు ఇచ్చింది, ప్రజలు సమాజంలో నన్ను ఇంత స్థాయికి తీసుకుని వెళ్ళారని, నేను పోయినా కూడా ఒకే జెండా కప్పుకుని పోతా తప్పా, నాలుగు జెండాలు కలిపికుట్టుకుని పైన కప్పించుకొనని, నేను దమ్ముతో ఒకే స్థానం నుంచి పోటీ చేశాను. ఒకే పార్టీలో ఉన్నానని ఎందుకంటే నీతి, నిజాయితీ, నమ్మకం ఉన్నాయి కాబట్టి పార్టీ పదవులు ఇచ్చినా కూడా వదిలి వెళ్లిపోయే అవకాశ వాదులు ఏ పార్టీకైనా చెద పురుగులే అంటూ మండిపడ్దారు. అలాంటి నీతిలేని ద్రోహులను తరిమికొట్టినప్పుడే రాజకీయాలకు పట్టిన మకిలి వదులుతుందని అన్నారు. అంతేకాదు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, చైర్మన్ లాంటి పదవులను పార్టీ ఇచ్చిందని, ఇప్పుడు తల్లి కష్టాలలో ఉందని ఒదిలిపోయే పిరికి పిందెలు మాకు అవసరం లేదని, మా వెనుక ప్రజలు ఉన్నారని అన్నారు. అయితే ప్రస్తుతం అయ్యన్నపాత్రుడు పార్టీ గురుంచి చెప్పిన మాటలను వింటుంటే అటు పార్టీ కార్యకర్తలు, అభిమానులే కాదు ప్రజలు కూడా నిజంగా శభాస్ అంటూ మెచ్చుకుంటున్నారు.