వైసీపీ లో చేరిన టీడీపీ నేత – సీఎం జగన్ పై ప్రశంసలు

Friday, November 15th, 2019, 12:10:11 AM IST

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల పరిస్థితి రోజురోజుకు చాలా దారుణంగా మారిపోతుంది. అప్పటివరకు కూడా పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేతలు కూడా ఒక్కసారిగా పార్టీ కి గుడ్ బై చెప్పి వేరే పార్టీ లో చేరిపోతున్నారు. కాగా ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష టీడీపీ పార్టీ లో బాగా జరుగుతుంది. ఇకపోతే ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటినుండి కూడా టీడీపీ మీద నమ్మకం లేని నేతలందరు కూడా టీడీపీ ని వదిలేస్తున్నారు. కాగా తాజాగా టీడీపీ పార్టీ కి చెందిన యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్‌ బుధవారం నాడు టీడీపీ పార్టీ కి గుడ్ బై చెప్పిన సంగతి మనకు తెలిసిందే.

కాగా నేడు దేవినేని అవినాష్ వైసీపీ లో చేరిపోయారు. కాగా సీఎం జగన్ కండువా కప్పి అవినాష్ ని పార్టీలోకి ఆహ్వానించారు. కాగా దేవినేని అవినాష్ తో పాటు విజయవాడకు చెందిన టిడిపి నేత కడియాల బుచ్చిబాబు తదితరులు కూడా వైసీపీ లో చేరిపోయారు. కాగా రాష్ట్రంలో సీఎం జగన్ తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడనయ్యె వైసీపీ లో చేరానని స్పష్టం చేశారు దేవినేని అవినాష్..