టీడీపీ నేతను గొంతుకోసి హత్య చేసిన దుండగులు.. మూడు రోజుల్లో రెండోది..!

Thursday, July 2nd, 2020, 02:06:59 AM IST


ఏపీలో రాజకీయ హత్యలు పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన మరువకముందే కృష్ణాజిల్లాలో మరో దారుణం జరిగింది.

టీడీపీ నేత తాతా సాంబయ్య (35)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పర్రచివర గ్రామ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తూ, ఎంపీటీసీ అభర్థిగా బరిలో ఉన్నారు. అయితే పెదగౌడపాలెం గ్రామానికి చెందిన తాతా సాంబయ్య నాగాయలంక నుంచి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా దుండుగులు అడ్డగించి గొంతుకోసి దారుణంగా చంపేశారు. అయితే సాంబయ్య హత్యపై టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.