వివేకా హత్య కేసుపై అసలు నిజాన్ని భయటపెట్టిన టీడీపీ నేత..!

Monday, October 14th, 2019, 07:55:38 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ బాబాయ్ మాజీ మంత్రి వివేకా హత్య రాజకీయాలలో సంచలనం రేపింది. అప్పట్లో ఆ హత్యను వైసీపీనే చేయించిందంటూ టీడీపీ ఆరోపణలు కూడా చేసింది. అయితే వివేక హత్యకు గురై చాలా రోజులు అవుతున్న పోలీసులు ఇప్పటికి ఆ హత్య కేసును చేధించలేకపోయారు. అయితే అప్పటి ప్రభుత్వం ఈ కేసును సిట్‌కు అప్పచెప్పింది. అయినా కూడా ఈ కేసు ఒక కొల్లిక్కి తీసుకురాలేకపోయారు. అయితే తాజాగా ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిపోయింది.

అయితే జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా ఈ హత్యకు సంబంధించిన దోషులు ఎవరో ప్రభుత్వం ఇంకా భయటపెట్టలేకపోయింది. అయితే వివేకా హత్య కేసుపై స్పందించిన టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసును తారుమారు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఈ కేసుకు సంబంధించిన అసలు నిందితులు ఎవరో జగన్‌కి తెలుసని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసును సీబీఐకి అప్పచెప్పాలని డిమాండ్ వినిపించిన జగన్ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారని అన్నారు. సొంత బాబాయి హత్యకేసు సీబీఐకి అప్పగిస్తే అసలు నిజాలు బయటకొస్తాయనే భయమన్నారు. అంతేకాదు కేసులో సలు నింధితులను పక్కనపెట్టి హత్యతో సంబంధం లేని అమాయకులను బలి చేయాలని చూస్తున్నారని ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. అయితే వివేక హత్య కేసుపై రోజుకో అబద్ధపు కథనం వెలువడుతుందని, దీని వెనుక ఎవరి హస్తం ఉందో త్వరలోనే తెలుతుందని అన్నారు.