ఆయన్ను చూసి వైసీపీ నేతలు బయపడుతున్నారు – టీడీపీ నేత సంచలన వాఖ్యలు…

Thursday, February 13th, 2020, 12:22:39 AM IST

అందరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి జరుగుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తూ, త్వరలోనే రాష్ట్రంలో బస్సు యాత్ర చేయాడాయికి కూడా సిద్ధమయ్యారు. అయితే చంద్రబాబు తలపెట్టినటువంటి ఈ బస్సు యాత్ర టాపిక్ రాగానే రాష్ట్రంలోని వైసీపీ నేతలందరూ కూడా గజ గజ వణికిపోతున్నారని టీడీపీ పార్టీ కీలక నేత బోండా ఉమా వాఖ్యానించారు. కాగా నేడు విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి హాజరైనటువంటి బోండా ఉమా మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలు చేస్తున్న దోపిడీ, భూ కబ్జాలను ప్రజలకు వివరంగా వెల్లడిస్తామని, వారు చేసే అన్యాయాన్ని కూడా ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తామని వాఖ్యానించారు. ఇకపోతే రాష్ట్రంలో ఒక అసమర్థత పాలన కొనసాగుతుందని, పాలన చేతకాని అసమర్థమైన నాయకుల చేతిలో రాష్ట్ర పాలన జరుగుతుందని, ఇలాంటి వారి వల్లే రాష్ట్రంలోని ప్రజలన్దరు కూడా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారూ.