నిజంగా నువ్వు మగాడివైతే ఓసారి బయటికి రా – టీడీపీ మహిళా నేత

Thursday, February 27th, 2020, 04:12:26 PM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై టీడీపీ నేతలు దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు ని అడ్డుకోవడం తో టీడీపీ నేతలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. సిగ్గుండాలి జగన్ మోహన్ రెడ్డి నీకు, నిజంగా నువ్వు మగాడివైతే ఓసారి బయటికి రా, చంద్రబాబు నాయుడి తో తేల్చుకో, అంతేగాని నీ చెంచాగాళ్లతో చంద్రబాబు నాయుడ్ని అడ్డుకొనే ప్రయత్నం చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడ్ని ఇక్కడినుండి తీసుకెళ్లడం ఖాయం, నీ అంతు చూడటం ఖాయం అని సంచలన వ్యాఖ్యలు చేసారు.

విశాఖపట్టణానికి కొత్త సంస్కృతిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు నాయుడికి భయపడి, ఆయనని తట్టుకోలేక, వైసీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులకి 500 రూపాయలు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేసారు. ఇది జగన్ మోహన్ రెడ్డి చేతగాని తనం అని ఘాటు విమర్శలు చేసారు. చంద్రబాబు నాయుడి ని ఎదుర్కోలేక ఈ రకమైన చెంచాగిరి చేయిస్తున్నారు అని విమర్శలు గుప్పించారు. విశాఖ ప్రజలు ఈ సంస్కృతిని చూస్తున్నారు కదా, రెడ్ల పాలనలో ఇలాంటి సంస్కృతి ఉంటుంది, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అనిత తెలిపారు.

అయితే గుండాలు, రౌడీలు రాజకీయాలు చేస్తే ఇలానే ఉంటుందని తెలిపిన అనిత, 14 ఏళ్ళు సీఎం గా ఉన్న వ్యక్తి ని రెండు గంటల పాటు ఎయిర్పోర్ట్ లో అడ్డుకోవడం బాధాకరం అని అన్నారు. చంద్రబాబు వైజాగ్ ని ఎపుడో ఆర్థిక రాజధాని చేసారని, జగన్ అమరావతి వచ్చి, జై అమరావతి అంటే విశాఖ లో ఎగ్జిక్యూటివ్ కాపిటల్ పట్ల చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తారని అన్నారు.