సీఎం గా జగన్ చరిత్రలో నిలిచిపోతారు – టీడీపీ నేత!

Sunday, August 2nd, 2020, 04:55:17 PM IST

Yanamala

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ వికేంద్రకరణ, సి ఆర్ డి ఎ రద్దు బిల్లులను ఆమోదం చేయడం పట్ల టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో మరొకసారి టీడీపీ సీనియర్ నేత, యనమల రామకృష్ణుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి పరుల పాలన లో మూడు ప్రాంతాల అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే సి ఆర్ డి ఎ రద్దు చేయడమే అభివృద్ది అవుతుందా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గవర్నర్ ఆమోదం తో అమరావతి రైతులు ఆందోళన చేపట్టిన నేపధ్యం లో యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఉద్యమానికి మద్దతు తెలుపుతూ, సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానికుల అస్తులన్నింటిని భూ కబ్జా దారులకు కట్ట బెట్టడమే వైసీపీ చేసే పని అని మండిపడ్డారు. అయితే పులి వెందులు ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ, ఏర్పాటు చేసి సి ఆర్ డి ఎ ను రద్దు చేస్తారా అంటూ విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సామాజిక బాధ్యత లేని ముఖ్యమంత్రి గా చరిత్రలో నిలిచిపోతారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.