పవన్ ని కలుసుకున్న టీడీపీ నేతలు – ఎందుకంటే…?

Wednesday, November 13th, 2019, 10:32:48 PM IST

ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా ఏర్పడిన ఇసుక సమస్యకు పరిష్కారం కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించనున్నటువంటి దీక్షకు తన వంతులం మద్దతు తెలపాలని టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, అచ్చెన్నాయుడు బుధవారం నాడు విజయవాడలోని పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఆ తరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన అచ్చెన్నాయుడు… ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు తలపెట్టినటువంటి దీక్షకు మద్దతునివ్వాల్సిందిగా పవన్‌ను కోరామని చెప్పారు.

అయితే ఈ విషయంలో పవన్ కూడా సానుకూలంగా స్పందించారని, చంద్రబాబు తలపెట్టిన దీక్షకు సంఘీభావం తెలుపుతామని స్పష్టం చేశారని టీడీపీ నేతలు తెలిపారు. అంతేకాకుండా సీఎం జగన్ ప్రవర్తన వలన రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని, ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని, వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.