జగన్ అండ్ కో ఫేక్ ప్రచారాలతో ప్రజలను ఎలా మాయచేస్తుందో చూడండి – టీడీపీ

Thursday, April 29th, 2021, 07:36:54 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉండటం చేత రాష్ట్ర ప్రభుత్వం అరికట్టేందుకు పలు రకాల చర్యలను తీసుకుంటుంది. అయితే ఇప్పటికే ఆసుపత్రుల్లో పడకల విషయం నుండి ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్స్ మరియు పలు సహాయక చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ కొందరు మాత్రం వైసీపీ పేరిట చేస్తున్న ప్రచారం పట్ల తెలుగు దేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

అయితే కరోనా వైరస్ కల్లోల పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోడానికి ప్రణాళికలు వేయాల్సిన జగన్ అండ్ కో ఫేక్ ప్రచారాలతో ప్రజలను ఎలా మాయచేస్తుందో చూడండి అంటూ తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించింది. అయితే అమెరికా లోని గ్రేటర్ కొలంబస్ కన్వెన్షన్ సెంటర్ ను కోవిడ్ సెంటర్ గా మార్చినప్పటి ఫోటో తెచ్చి, ఇదంతా మా విజనరీ లీడర్ జగన్ గొప్పదనం అని చెప్పుకుంటున్నారు అంటూ ఘాటు విమర్శలు చేయడం జరిగింది. అయితే ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో చూడకుండా ఈ ఫేక్ ప్రచారాలు ఏంటి అంటూ సూటిగా ప్రశ్నించింది తెలుగు దేశం పార్టీ. అయితే ఇందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.