జగన్ రాజీనామా చేయాలి.. టీడీపీ నేత అచ్చెనాయుడు డిమాండ్..!

Saturday, May 30th, 2020, 03:00:01 AM IST

ఏపీ ఎన్నికల కమీషనర్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.

అయితే చట్టానికి అతీతంగా ఆర్డినెన్స్‌ తెచ్చిన జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని, ఇకమీదైనా జగన్ తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలని అన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలని సూచించారు.