జగన్‌కి కూడా అదే పరిస్థితే వస్తుంది.. జోస్యం చెప్పిన టీడీపీ నేత..!

Sunday, January 26th, 2020, 03:00:22 AM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని వాటిని ఆలోచన విధానాలు లేకుండా అమలు చేయాలనుకోవడం అవివేకమని అన్నారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో కుదరదని అన్నారు.

అయితే అసెంబ్లీలో పవర్ కట్ చేయించి, మైకులు కట్ చేయించి టీవీ ఛానళ్ళను అనుమతించకుండా చేశారని దుయ్యబట్టారు. అయితే హిట్లర్, ముస్సోలిని లాంటి నియంతల మాదిరిగా జగన్ పాలన ఉందని అలాంటి వారే కాలగర్భంలో కలిసిపోయారని, జగన్‌కి కూడా నియంతలా దుస్థితే పడుతుందని అన్నారు.