బీజేపీ కి షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే…?

Monday, February 17th, 2020, 09:23:53 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంతటి దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుందో మనందరికీ తెలిసిందే. కాగా అప్పటినుండి తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం లేనటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, మాజీ నేతలు అందరు కూడా తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పి, అధికార వైసీపీలో కానీ, బీజేపీ పార్టీలో కానీ చేరిపోయారు. చివరికి ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీని వీడటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ కీలక నేత గంటా శ్రీనివాసరావు కూడా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ లో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది.

కానీ అనూహ్యంగా ఏపీ బీజేపీ నేతలకు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు పెద్ద షాక్ ఇచ్చారు. సోమవారం నాడు విశాఖ లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో, అప్పటివరకు వారందరు కూడా బీజేపీలో ఉంటారని అనుకుంటున్న తరుణంలో, టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు వారందరిని టీడీపీలో చేర్పించుకున్నారు. కాగా విశాఖ పట్నంలోని టిడిపి కార్యాలయంలో టీడీపీ నేత గంటా సమక్షంలో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీడీపీ లో చేరిపోయారు. వారందరిని కూడా గంటా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ… టీడీపీ కి మళ్లి పూర్వ వైభవం వస్తుంది. నేడు 300 మంది బీజేపీ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు అందరు కూడా టీడీపీ లో చేరడం అనేది ఆనందకరంగా ఉందని వాఖ్యానించారు.