కోర్టు లో రేవంత్ రెడ్డి

Friday, September 30th, 2016, 01:55:10 AM IST

REVANTH
ఓటుకు నోటు కేసు పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చే పేరు రేవంత్ రెడ్డి, ఎలక్షన్ లో ఓటు కోసం ఎమ్మెల్సీ ని కొంటూ అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్ది కొన్నాళ్ళు జైల్లో ఉండి మరీ బెయిలు మీద బయటకి వచ్చారు. ఇవాళ ఏసీబీ కోర్టు లో విచారణ కి హాజరు కాబోతున్నారు ఆయన. హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలో ఏసీబీ కోర్టు లో విచారణ జరగనున్న నేపధ్యం లో ఈ కోర్టుకు రేవంత్ రాబోతున్నారు. ఈ కేసు విచారణకు హాజరుకావాల్సిందిగా గత నెలలోనే వారికి ఏసీబీ సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం 10.30 గంటలకు కోర్టు ముందు హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలు చేసింది. దాదాపుగా వాయిదా పడే ఛాన్స్ లు కనిపిస్తున్న ఈ అంశం లో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి మరి.